Site icon HashtagU Telugu

Vijay Deverakonda: ముగిసిన లైగర్ విచారణ.. విజయ్ ఏమన్నాడంటే..?

Vijay Devarakonda

Vijay Devarakonda

హీరో విజయ్ దేవరకొండకు లైగర్ మూవీతొ కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. లైగర్ సినిమా మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బుధవారం ఈడీ ఎదుట విచారణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. 11 గంటలపాటు అతడిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. లైగర్ పెట్టుబడులు ఎవరు పెట్టారు..? సినిమాలో రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు..? ట్రాన్సాక్షన్స్ ఏవిధంగా జరిగాయి..? అనేదానిపై విజయ్‌ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే

ఈడీ విచారణ అనంతరం హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయని, అందులో ఇదొకటని వెల్లడించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, పూర్తిగా సహకరించానని తెలిపారు. తనను మళ్లీ రమ్మని ఈడీ అధికారులు చెప్పలేదన్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మీని కూడా ఈడీ విచారించింది. మూవీ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన డబ్బు విదేశాల నుంచి లైగర్ నిర్మాతలకు అందిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.