Site icon HashtagU Telugu

Vijay Recover: గాయం నుంచి కోలుకున్న విజయ్.. ‘ది బీస్ట్ ఈజ్ డైయింగ్’ అంటూ పోస్ట్!

Vijay

Vijay

విజయ్ దేవరకొండ, అనన్య నటించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంచనాలు తప్పినా.. హీరో విజయ్ మాత్రం మనసుపెట్టి సినిమా చేశాడు. ఈ సినిమా కోసమే ముంబైలో ఓ ప్లాట్ ను కూడా అద్దెకు కూడా తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా రూపుదిద్దుకోవడంతో విజయ్ కఠినంగా శ్రమించాల్సి వచ్చింది.

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గెస్ట్ రోల్ కనిపించిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్న విషయం తెలసిందే. అయితే విజయ్ దేవరకొండ కొన్ని సాధ్యంకాని సీన్స్ లో నటించాల్సి వచ్చింది. బాక్సర్‌గా నటించేందుకు విజయ్ కఠినమైన వర్కవుట్స్ కూడా చేయాల్సి వచ్చింది.  కంటిన్యూగా షూట్ చేయడం వల్ల భుజం గాయంతో బాధపడ్డాడు. అయితే ఎట్టకేలకు విజయ్ దేవరకొండ కోలుకున్నాడు.

ఎనిమిది నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లు విజయ్ దేవరకొండ వెల్లడించాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేశాడు. “8 నెలల తర్వాత కోలుకున్నాను. కష్టపడితేనే కలలు సాధ్యమవుతాయి. సమస్యలను అధిగమించండి” అని విజయ్ దేవరకొండ క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోలో తన చేతివేళ్లను పోస్ట్ చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version