Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. కత్తి, నెత్తురు, యుద్ధం..

'ఫ్యామిలీ స్టార్' సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆ మూవీ..

  • Written By:
  • Updated On - May 9, 2024 / 09:52 AM IST

Vijay Deverakonda : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రాజా వారు రాణి గారు’ వంటి విలేజ్ లవ్ స్టోరీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో కత్తి పట్టుకున్న చెయ్యి, దాని నిండా రక్తం కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ పై ఇలా రాసుకొచ్చారు.. ‘కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే’ అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ క్యాప్షన్ ఆడియన్స్ లో ఆసక్తిని కలగజేస్తుంది. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు రురల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించలేదు. ఇప్పుడు ఈ సినిమాలో నటించడమే ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ అంటే, పోస్టర్ లో కత్తి, నెత్తురు, యుద్ధం అంటూ మరింత ఆసక్తిని కలగజేస్తున్నారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందట. ఇక ఈ సినిమాకి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ ని ఖరారు చేసారని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు.

కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస ప్లాప్ ల్లో ఉన్నారు. ఆయన అభిమానులంతా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పైనే అసలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా, గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా పై బలమైన నమ్మకం పెట్టుకున్నారు. మరి ఆ నమ్మకాన్ని విజయ్ అండ్ మేకర్స్ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.