Site icon HashtagU Telugu

Vijay Deverakonda : మరోసారి పొలిటికల్ డ్రామాతో విజయ్ దేవరకొండ.. ఈసారైనా హిట్ కొట్టేనా..?

Vijay Deverakonda Ravi Kiran Kola Movie Is Periodic Political Drama Movie

Vijay Deverakonda Ravi Kiran Kola Movie Is Periodic Political Drama Movie

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ని చేస్తున్నారు. ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం చేయబోతున్నారు. యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ‘రాజా వారు రాణి గారు’ వంటి లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ దర్శకుడు.. రెండో సినిమాకి విజయ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నారు.

ఇక ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని మొన్నటివరకు టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ పీరియాడిక్ డ్రామాలోనే పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందట. సింపుల్ గా చెప్పాలంటే.. రామ్ చరణ్ రంగస్థలం తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. కాగా పొలిటికల్ నేపథ్యంతో విజయ్ దేవరకొండ గతంలో ‘నోటా’ అనే సినిమాని చేశారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి పొలిటికల్ డ్రామాని టచ్ చేస్తున్నారు.

అలాగే నిర్మాత దిల్ రాజుతో విజయ్ రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది. మరి ఈ రెండు రిజల్ట్స్ కి విజయ్ ఈ సినిమాతో హిట్ అందుకొని గట్టి సమాధానం చెబుతారా లేదా చూడాలి. కాగా ఈ చిత్రాన్ని మే 9న విజయ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. పూజా కార్యక్రమాలతో ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట.

ఇక గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా విషయానికి వస్తే.. విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది. ఒక సరికొత్త కథతో విజయ్ ని ఇప్పటివరకు చూపించిన పాత్రతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ భారీ కమ్‌బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also read : Naga Chaitanya : సాయి దుర్గ తేజ్, నాగచైతన్యతో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నారా..?