Site icon HashtagU Telugu

Vijay-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా దొరికేసారేంటీ..!

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay-Rashmika : టాలీవుడ్‌లో ఎంతో కాలంగా ప్రేమ గాసిప్స్‌కు కేంద్రబిందువైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ కలిసి కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రష్మిక ప్రయాణిస్తున్న కారులో విజయ్ కూడా ఉండటాన్ని పాపరాజ్జీలు తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై గతంలో వచ్చిన ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పటి నుంచే ఈ జంట మీద చర్చలు మిన్నంటుతూనే ఉన్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తున్న ‘కుబేర’ మూవీ బృందానికి సోషల్ మీడియాలో విజయ్ స్పెషల్ విషెస్ తెలిపాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రతిభను పొగడ్తలతో ముంచెత్తిన విజయ్, ఈ సినిమాపై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నాడు.

ఇక విజయ్ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ థ్రిల్లర్‌పై పనిచేస్తున్నాడు. అందులో కథానాయికగా రష్మిక ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, ఈ హిట్ పెయిర్ ముచ్చటగా మూడోసారి స్క్రీన్ పై మెరవనుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనే ప్రశ్నకు ఇంకా అధికారిక సమాధానం రాలేదైనా, అభిమానులు మాత్రం ఈ జంటను తెరపైనైనా చూడాలని ఆశిస్తున్నారు.

Maoists : మావోయిస్టుల మరో ఎదురు దెబ్బ .. ముగ్గురు కీలక నేతలు హతం