Vijay and Rashmika: మల్దీవ్స్ లో రచ్చ రచ్చ చేసిన జంట.. పిక్స్ వైరల్!

Vijay and Rashmika జంట మరోసారి వెకేషన్ కు వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలో వైరల్ అవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Vijay And Rashmika

Vijay And Rashmika

టాలీవుడ్ (Tollywood) హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ అందరికీ తెలిసిందే. ఈ జంటకు (Vijay and Rashmika) ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్స్ వెళ్తుండటం కామన్ గా మారింది. ఇప్పటికే పలుమార్లు వెకేషన్ కు వెళ్లిన ఈ ఇద్దరు తాజాగా మరోసారి హాలిడే ట్రిప్ కు వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి (Vijay and Rashmika) సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. హీరో విజయ్ దేవరకొండ వైన్ బాటితో, షర్ట్ లేకుండా కనిపించాడు. ఇక రష్మిక బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో రిలాక్స్ అవుతోంది.

“మనమందరం కష్టపడి నవ్వినప్పుడు, నిశ్శబ్దంగా ఏడ్చినప్పుడు, లక్ష్యాలను ఛేదించినప్పుడు, కొన్ని గెలిచినప్పుడు, కొన్నింటిని కోల్పోయినప్పుడు 🙂 క్షణాలను అనుభవించిన సంవత్సరం’’ అంటూ విజయ్ ఇన్ స్టా(Instagram) పోస్టుకు  క్యాప్సన్ ఇవ్వగా, “హలో 2023…” అంటూ రష్మిక పోస్ట్ పెట్టింది. ఇద్దరి ఫొటోలు వైరల్ గా మారడంతో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రేమజంట Vijay and Rashmika మళ్లీ మాల్దీవ్స్ కు వెళ్లింది’’ అంటూ కామెంట్స్ చేశారు.

విజయ్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం ‘లైగర్’లో (Liger) కనిపించాడు. బాలీవుడ్ కు ఎంట్రీ అయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ఆ తర్వాత సమంత రూత్ ప్రభు సరసన ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు, రష్మిక చివరిసారిగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’లో కనిపించింది. ఆమె తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’ రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ (Animal) లో కనిపించనుంది.

Also Read : NTR 30: శరవేగంగా ‘ఎన్టీఆర్‌-కొర‌టాల శివ’ మూవీ షూటింగ్‌.. రిలీజ్‌ డేట్ లాక్!

  Last Updated: 02 Jan 2023, 12:27 PM IST