Vijay Deverakonda – Rashmika : ఇన్‌స్టా స్టోరీలతో మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక..

ఇన్‌స్టా స్టోరీలతో మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక. విజయ్ షేర్ చేసిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో..

Published By: HashtagU Telugu Desk
Vijay Deverakonda Rashmika Mandanna Gave Hint Their Relationship With Insta Stories

Vijay Deverakonda Rashmika Mandanna Gave Hint Their Relationship With Insta Stories

Vijay Deverakonda – Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమ బంధాన్ని రహస్యంగా మెయిన్‌టైన్ చేస్తూనే, తాము డేటింగ్ చేస్తున్నట్లు ఆడియన్స్ కి హింట్స్ ఇస్తూ వస్తున్నారు. వారిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తామంటూ తమ సోషల్ మీడియా పోస్టులు ద్వారా తెలియజేస్తున్నారు. రష్మిక ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఆ సమయంలోనే విజయ్ కూడా కొన్ని ఫోటోలు షేర్ చేస్తారు.

ఆ పిక్స్ లో ఇద్దరు కలిసి ఉండరు. కానీ వారు షేర్ చేసిన ఫోటోల బ్యాక్‌గ్రౌండ్స్ మాత్రం ఒకేలా ఉంటాయి. ఇలా వీరిద్దరూ ఎప్పుడు వెకేషన్ కి వెళ్లినా, లేక ఫెస్టివల్ టైంలో షేర్ చేసే ఫొటోల్లో అయినా.. బ్యాక్‌గ్రౌండ్స్ ఒకేలా ఉంటాయి. మేము డేటింగ్ చేస్తున్నాము అని డైరెక్ట్ గా చెప్పకపోయినా.. ఇలా బ్యాక్‌గ్రౌండ్స్ తో హింట్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీలో కూడా ఓ హింట్ వదిలారు.

విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ రేపు ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. దీంతో అమెరికా ఆడియన్స్ కోసం విజయ్ ఒక ప్రమోషనల్ వీడియోని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసారు. ఆ వీడియోలో విజయ్ బ్యాక్‌గ్రౌండ్ ఒక నెమలి కనిపిస్తుంది. ఇక మరో పక్క రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో ఒక నెమలి ఫోటోని షేర్ చేసారు. ఇక రెండిటిని గమనించిన నెటిజెన్స్.. వారిద్దరూ ఒకే చోట ఉన్నారని కామెంట్స్ చేస్తూ వేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే.. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ నెట్టింట పోస్టులు వేస్తున్నారు.

కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా రష్మిక మందన్న పుట్టినరోజునే రిలీజ్ అవుతుంది. ఆ రోజున మూవీ రిలీజ్ అవ్వడం తాను లక్కీగా భావిస్తున్నాను అంటూ విజయ్ ఇటీవల చెప్పుకొచ్చారు, మరి రష్మిక బర్త్ డే విజయ్ కి సక్సెస్ తీసుకువస్తుందేమో చూడాలి.

Also read : Chiranjeevi : ఆటో రామ్‌ప్రసాద్ గృహప్రవేశానికి.. చిరంజీవి ఏం బహుమతి పంపించారో తెలుసా..!

  Last Updated: 04 Apr 2024, 10:55 AM IST