Site icon HashtagU Telugu

Vijay Deverakonda : నెటిజెన్ పోస్టుతో.. విజయ్, రష్మిక వెకేషన్ బయటపడిపోయిందిగా..

Vijay Deverakonda Rashmika Mandanna

Vijay Deverakonda Rashmika Mandanna

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ మూవీ ప్రమోషన్స్ పాల్గొంటూ.. మూవీని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మాత్రం కనిపించడం లేదు. అసలే సినిమా పై ఓ రేంజ్ నెగటివిటీ వస్తున్న టైములో విజయ్.. ప్రమోషన్స్ చేయకుండా ఎక్కడికి వెళ్లిపోయారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మూవీ ప్రమోషన్స్ లో విజయ్ కనిపించకపోవడంతో నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ రోజునే రష్మిక బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్, రష్మిక బర్త్ డేని సెలబ్రేట్ చేయడం కోసం ఆమెతో కలిసి ఫారిన్ వెకేషన్ కి వెళ్లాడని ఓ వార్త వైరల్ అవుతూ వచ్చింది. అయితే వెకేషన్ కి వెళ్తే.. ఎయిర్ పోర్ట్ వద్ద ఫోటోలు అయినా నెట్టింట కనిపించేవి. కానీ అవి కనిపించకపోవడంతో విజయ్, రష్మిక వెకేషన్ రూమర్ అనుకున్నారు.

కానీ తాజాగా ఓ నెటిజెన్ చేసిన పోస్టుతో ఆ వార్త రూమర్ కాదు నిజమే అని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ అండ్ రష్మిక దుబాయ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ జాయేద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో వర్క్ చేసే ఒక ఇండియన్.. తన ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ తో దిగిన ఫోటోని షేర్ చేసారు. ఇక ఆ ఫోటో కింద క్రెడిట్స్ ఇస్తూ.. ‘ఫోటో తీసింది శ్రీవల్లి’ అని రాసుకొచ్చాడు. శ్రీవల్లి అంటే పుష్ప సినిమాలో రష్మిక పాత్ర పేరు.

ఇది గమనించిన నెటిజెన్స్.. ఈ పోస్టుని వైరల్ చేస్తున్నారు. విజయ్ అండ్ రష్మిక దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఎంత సీక్రెట్ గా ఉంచుతున్నా ప్రేమ విషయం బయట పడిపోతుంది. ఇంకెందుకు దాచడం బయటపెట్టవచ్చుగా అంటూ విజయ్ కి సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Tillu Square : రెండేళ్ల క్రితం చెప్పిన మాటని సాధించిన సిద్ధూ.. అట్లుంటది టిల్లుతోని..