Site icon HashtagU Telugu

Deverakonda Prank On Samantha: సమంతను సర్ ప్రైజ్ చేసిన రౌడీ హీరో..!!

Vijay Imresizer

Vijay Imresizer

రౌడీహీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరూ కల్సి ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ సినిమా. ప్రస్తుతం కశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే గురువారం సమంత బర్త్ డే సందర్భంగా ఆమెకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. షూటింగ్ సీన్ అంటూ ఒక ఫేక్ డైలాగ్ ను ఆమెతో రిహార్సల్ చేయించారు.

 


యాక్షన్ అనగానే లవ్ ఫీల్ తో సమంత ఆ డైలాగ్ చెబుతుండగా…పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విజయ్ దేవరకొండ చెప్పడంతో సామ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక దర్శకుడు శివ నిర్వాణ సహా సెట్లోని వాళ్లంతా హ్యాపీ బర్త్ డే అంటూ ఒక్కసారిగా కేకలు పెట్టడంతో ఇది ఫేక్ రిహార్స్ అని అర్థమయ్యింది. ఆ తర్వాత సెట్లోనే సమంత పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విజయ్ దేవరకొండ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.