Site icon HashtagU Telugu

Liger in Asia Cup: భారత్, పాక్ మ్యాచ్ లో లైగర్

Vijay dubai

Vijay dubai

చిరకాల ప్రత్యర్థులు భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎవ్వరికైనా ఆసక్తే… సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ వరకూ మ్యాచ్ ను వీక్షిస్తారు. అవకాశం ఉంటే స్టేడియానికి వెళ్ళి చూసేందుకు ఇష్టపడతారు. ఇక తమ సినిమా ప్రమోషన్స్ కోసం నటీనటులు ఇలాంటి ఛాన్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరు.

ప్రస్తుతం ఇదే బాటలో వెళుతున్నాడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌లో సందడి చేశాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సరదాగా చిట్ చాట్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అనంతరం స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్‌తో మాట్లాడిన విజయ్ దేవరకొండ స్టేడియంలో ఉన్న సందడి గురించి తెలుగు కామెంటేటర్లతో పంచుకున్నాడు. పూర్తిగా ఫ్యాన్స్ తో నిండిపోయిన స్టేడియంలో మ్యాచ్ చూస్తుంటే ప్రత్యేక అనుభూతి కలుగుతుందని చెప్పాడు. జాతీయగీతం వచ్చినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయన్నాడు.

 

Also Read: India Beats Pakistan: దెబ్బ అదుర్స్ కదూ… పాక్ ను చిత్తు చేసిన టీమిండియా

 

ఇక విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని విజయ్ దేవరకొండ తన మనసులోని మాటను బయటపెట్టాడు. రణ్‌వీర్ నటించిన కపిల్ బయోపిక్ 83 మూవీలో కృష్ణమాచారి పాత్ర కోసం తనను అడిగారని, తనకు కుదరలేదని చెప్పుకొచ్చాడు. క్రికెట్ లో కోహ్లీ యాటిట్యూడ్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు విజయ్. ఇదిలా ఉంటే క్రేజీ మ్యాచ్ కు ముందు గ్రౌండ్ లోవిజయ్‌ను ఇలా చూసిన తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. మ్యాచ్జ రుగుతున్నప్పుడు కూడా పలుసార్లు టీవీ కెమెరాలు కూడా విజయ్ ను ఫోకస్ చేసాయి.