VIjay Deverakonda: కరణ్ షో ఎఫెక్ట్.. ఛీజ్ అంటూ కామెంట్స్.. ఫీలైన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 07:45 AM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో రౌడీ హీరో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రం బృందం బిజీ బిజీగా ఉన్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు కొన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ఇండియాలోనే ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ అనన్య కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షోలో ఆయ‌న సెక్స్ గురించి చెప్పిన విష‌యాలు వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు.. కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షోపై విజ‌య్ దేవ‌ర‌కొండ అంత హ్యాపీగా లేడ‌ట‌.

అందుకు కార‌ణం ఈ టాక్‌షోలో జాన్వీ క‌పూర్‌ సారా అలీఖాన్ పాల్గొన్న‌ప్పుడు ఇద్ద‌రూ త‌మ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్ చేయాల‌నుంద‌ని అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అలా వారితో మాట్లాడేట‌ప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఛీజ్‌ తో పోల్చారు హోస్ట్ క‌ర‌ణ్ జోహార్. దీంతో ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎక్క‌డ‌కు వెళ్లినా నార్త్ ఆడియెన్స్‌, రిపోర్టర్స్ త‌న‌తో ఛీజ్ అంటూ మాట్లాడుతున్నారు. ఇది త‌న‌కు చాలా ఇబ్బందిగా మారింది. తాజాగా ముంబైలో లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం వెళ్లిన‌ప్పుడు ఓ వ్య‌క్తి విజయ్ అన్న మీకు ఛీజ్ కావాలా? అని గట్టిగా అన్నాడు. అది నచ్చని రౌడీ స్టార్ ఏదో కోపంగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.