Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బర్త్ డేకి.. రెడీ అవుతున్న బహుమతులు..

విజయ్ దేవరకొండ బర్త్ డేకి అదిరిపోయేయి బహుమతులు రెడీ చేస్తున్న మూవీ మేకర్స్.

Published By: HashtagU Telugu Desk
Vijay Deverakonda New Movie Updates On His Birthday Occasion

Vijay Deverakonda New Movie Updates On His Birthday Occasion

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. మరో నాలుగు రోజుల్లో తన బర్త్ డేని జరుపుకోబోతున్నారు. ఇక ఈ పుట్టినరోజుకి తన సినిమాల నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు లైనప్ లో రెడీ గా ఉన్నాయి.

ఈ బర్త్ డేకి ఈ మూడు చిత్రాల నుంచి అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయట. VD12 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న గౌతమ్ తిన్ననూరి మూవీ టైటిల్ ని బర్త్ డే బహుమతిగా తెలియజేయనున్నారట. ఈ టైటిల్ ని ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చేయబోయే సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాతో పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఇక గతంలో తనకి మంచి విజయాన్ని అందించిన ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ తో విజయ్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాహుల్.. తన నెక్స్ట్ సినిమాని విజయ్ తో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ని ఈ బర్త్ డే నాడు ఇవ్వనున్నారట. ఈ మూడు అప్డేట్స్ తో రౌడీ ఫ్యాన్స్ కి ఈ బర్త్ డే స్పెషల్ కాబోతుంది.

కాగా గీతగోవిందం తరువాత విజయ్ నుంచి మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ రాబోయే ఈ మూడు ప్రాజెక్ట్స్ పై తమ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై రౌడీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఫ్యాన్స్ ఆశలను ఈ సినిమా తీరుస్తుందా లేదా చూడాలి.

  Last Updated: 05 May 2024, 12:44 PM IST