Vijay Deverakonda: విజయ్ బుగ్గ గిల్లిన దిల్ రాజు.. ముద్దుల ముద్దులు పెట్టిన లేడి ఫ్యాన్స్?

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 12:46 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది.

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. మృణాల్ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. విజయ్ కి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్వరలో ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నేడు ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

ట్రైలర్ కూడా వైరల్ అయి ట్రెండింగ్ లో ఉంది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఉదయం చేయగా, ఇప్పుడు రాత్రి తిరుపతిలో చేస్తున్నారు. తిరుపతిలో విజయ్ దేవరకొండని చూడటానికి భారీగా అభిమానులు వచ్చారు. బైక్ ర్యాలీ కూడా చేసారు. తిరుపతిలోని PJR థియేటర్లో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా అమ్మాయిలు కూడా భారీగా వచ్చి సందడి చేసారు. అక్కడికి వచ్చిన అమ్మాయిలు గాలిలోనే విజయ్ దేవరకొండకి ముద్దులు విసురుతూ, అరుపులు, విజిల్స్ తో హంగామా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఈ సినిమాలో విజయ్ ని చూసి అమ్మాయిలు అంతా ఫ్లాట్ అవుతారు అని మా ఆవిడ చెప్పింది. ఇక్కడ అమ్మాయిలు విజయ్ ని చూసి హడావిడి ఆపేలా లేరు అంటూ విజయ్ బుగ్గ గిల్లి మరీ చెప్పాడు. దిల్ రాజు విజయ్ బుగ్గ గిల్లడం, ఒక పక్క అమ్మాయిలు విజయ్ కి గాల్లోకి ముద్దులు విసరడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దిల్ రాజు మగధీనంతో అమ్మాయిలు మరింత రెచ్చిపోయి గాలిలోని ఫ్లైయింగ్ కిస్ లతో ముద్దుల ముద్దుల వర్షం కురిపిస్తున్నారు.