Site icon HashtagU Telugu

Vijay Deverakonda : ‘అవును’ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేయాల్సింది.. రవిబాబు కామెంట్స్..

Vijay Deverakonda Is To Be The Hero In Ravibabu Avunu Movie

Vijay Deverakonda Is To Be The Hero In Ravibabu Avunu Movie

Vijay Deverakonda : ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్‌డమ్ ని సొంతం చేసుకున్న హీరో ‘విజయ్ దేవరకొండ’. హీరోగా అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన విజయ్.. చిన్ని చిన్ని అవకాశాలు అందుకుంటూ వచ్చారు. బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన విజయ్ దేవరకొండ.. నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తరువాత పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయారు.

అయితే ఈ రెండు సినిమాలు కంటే ముందు విజయ్ ఓ సినిమాలో లీడ్ రోల్ చేయాల్సిందట. రవిబాబు సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘అవును’లో విజయ్ హీరోగా నటించాల్సిందట. పూర్ణ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో మేల్ లీడ్ గా హర్షవర్ధన్ నటించారు. అయితే హర్ష కంటే ముందుగా.. ఈ పాత్రలో విజయ్ దేవరకొండని అనుకున్నారట. అందుకోసం విజయ్ ని కూడా సంప్రదించారట. ఈ విషయాన్ని స్వయంగా రవిబాబే తెలియజేసారు.

రీసెంట్ ఆ రవిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన అవును సినిమా గురించి మాట్లాడుతూ.. “హర్ష పాత్ర కోసం ముందుగా విజయ్ దేవరకొండని అనుకున్నాము. అయితే ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల విజయ్ ఆ పాత్ర చేయలేకపోయాడు” అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. హర్షకి కూడా మంచి గుర్తింపునే ఇచ్చింది.

ఏదేమైనా విజయ్ ఆ హిట్ సినిమా మిస్ చేసుకున్నా, తరువాత క్రేజీ ప్రాజెక్ట్స్ ని అందుకొని సూపర్ హిట్స్ ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. విజయాపజయాలతో సంబంధం లేకుండా తన ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు.