టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కారుకు జరిగిన ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ ఘటనలో ఆశ్చర్యకరంగా ఆయన ప్రేయసి, నటి రష్మిక మందన్నా(Rashmika) పేరు వైరల్ అవుతుంది. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన రెండు రోజులకే ఈ కారు ప్రమాదం చోటుచేసుకోవడంతో, కొందరు నెటిజన్లు “రష్మికది ఐరన్ లెగ్” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్లు వైరల్ అవుతూ, అభిమాన వర్గాల్లో విభిన్న అభిప్రాయాలకు దారి తీస్తున్నాయి.
Digital Currency : డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం – పీయూష్ గోయల్
అయితే మరోవైపు.. ఈ ప్రమాదంలో రష్మికను దూషించడం అన్యాయం అని కొంతమంది నెటిజన్లు ఘాటుగా ప్రతిస్పందిస్తున్నారు. “ఒక ప్రమాదం జరిగిందంటే దానికి వ్యక్తిగతంగా ఎవ్వరినీ కారణంగా చూపడం అసంబద్ధం. ఆలోచనాత్మకంగా చూస్తే, ప్రమాదం జరిగినా విజయ్ దేవరకొండ ప్రాణాలతో బయటపడటం అదృష్టం. దానికి రష్మికే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిందని భావించొచ్చు” అని. సోషల్ మీడియాలో ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు రోజురోజుకూ పెరగడం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని ప్రజలు ఎక్కువగా విశ్లేషించడం తెలుగు సినీ ప్రపంచంలో కొత్త క్రమాన్ని సూచిస్తోంది.
ఇక ఈ సంఘటనపై విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన్నా ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే అభిమానులు మాత్రం తమ ఇష్టమైన జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. “ప్రమాదం అనేది ఎవరికైనా జరగవచ్చు, దానిని దురదృష్టంతో కలపడం సరికాదు” అని చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా, ఈ ఘటన రష్మిక పేరుతో వచ్చిన ప్రతికూల కామెంట్లు మరియు వాటికి వచ్చిన ప్రతిస్పందనలతో మరింత చర్చనీయాంశంగా మారింది.
