Vijay Deverakonda : విజయ్ దేవరకొండ VD12 మూవీ షూటింగ్ ఇంకెంత ఉందో తెలుసా..?

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ VD12 మూవీ షూటింగ్ ఇంకెంత ఉందో తెలుసా..?

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 03:31 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళ్ మరియు శ్రీలంక నేపథ్యంతో సాగనుంది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవలే శ్రీలంకలో చిత్రీకరణ చేసుకునేందుకు అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే.

అక్కడ ఒక హిస్టారిక్ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించారట దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మూవీలో ఈ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని మూవీ టీం చెబుతుంది. కాగా ఈ సినిమా ఇప్పటివరకు ఎంత షూటింగ్ జరుపుకుంది అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. తాజాగా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న విషయం ఏంటంటే.. శ్రీలంక షెడ్యూల్ తో కలిపి ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుందట. ఇక కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే ఉందని సమాచారం. మరి ఆ బ్యాలన్స్ షూట్ ని పూర్తీ చేసి.. సినిమా రిలీజ్ ని ఎప్పుడు ప్లాన్ చేస్తారో చూడాలి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1983 నుంచి 2009 వరకు జరుగుతూ వచ్చిన శ్రీలంక తమిళియన్స్ సివిల్ వార్ నేపథ్యంతో ఉండబోతుందని సమాచారం. ఈక్రమంలోనే చరిత్రలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలను కూడా సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా గతంలో ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు, ఆ స్థానంలోకి మమితా బైజు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం.. ఇప్పటివరకు హీరోయిన్ గురించి ఏ క్లారిటీ ఇవ్వలేదు.

Follow us