Family Star: రష్మిక బర్త్‌డే రోజు విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్.. కావాలనే ప్లాన్ చేశారు కదా అంటూ?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తె

Published By: HashtagU Telugu Desk
Mixcollage 04 Feb 2024 09 34 Am 8084

Mixcollage 04 Feb 2024 09 34 Am 8084

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా వేశారు. ఈ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా విడుదల తేదీన వాయిదా వేయడంతో నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ సినిమానుఅదే తేదికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు అదంతా పక్కన పెడితే తాజాగా విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.

అదేంటంటే విజయ్ దేవరకొండ సినిమాను తాజాగా ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు ఉంది. రష్మిక పుట్టినరోజు నాడే విజయ్ దేవరకొండ సినిమా విడుదల అవుతుండడంతో చాలామంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కోఇన్సిడెన్సా? లేక కావాలని ప్లాన్ చేశారా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పలువురు దీనిపై పోస్టులు కూడా చేస్తూ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ రకంగా అయినా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అవుతుంటే, రష్మిక పుట్టిన రోజు నాడే విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరోసారి ఈ ఇద్దరూ వైరల్ అవుతున్నారు. గతంలో విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ కు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

  Last Updated: 04 Feb 2024, 09:35 AM IST