టాలీవుడ్‌లో రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి”తో సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత “గీతా గోవిందం” వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో ఆయన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్నారు. ఇందులో రష్మిక మందన్నతో కలిసి నటించి మంచి నటనను ప్రదర్శించడంతో పాటు, వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాతి చిత్రం “డియర్ కామ్రేడ్” ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఈ జంట మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల ద్వారా విజయ్ మరియు రష్మిక ఇద్దరూ యూత్ లో ఫాలోయింగ్‌ను సంపాదించారు.
తాజాగా విజయ్ తన కెరీర్, విజయాలు, ఫెయిల్యూర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం” అని తెలిపారు. ఇండస్ట్రీలో బయటి నుంచి వచ్చి ఎదగడం ఎంత కష్టమో, అవకాశాలు, అవరోధాల మధ్య నడవాల్సిన తీరును వివరించారు. తనకూ స్క్రిప్ట్‌లో మార్పులు చెప్పే సౌలభ్యం లేదని, తాను ముఖం మీదే నో చెప్పే వ్యక్తినని వెల్లడించారు. మరోవైపు మీడియా ప్రమోషన్ల సమయంలో తాను చెప్పే మాటలు తప్పుగా ప్రెజెంట్ అవుతాయనే భయంతో తక్కువగా మాట్లాడాలని తన టీమ్ చెబుతుందని, కానీ తాను నెమ్మదిగా ఆ బ్యాలెన్స్ నేర్చుకుంటున్నానని చెప్పారు.
Shivling Puja: గర్భధారణ సమయంలో శివుడ్ని పూజించడటం వల్ల లాభాలు ఉన్నాయా?
అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. “నాకు 35 ఏళ్లు. నేను సింగిల్ కాదు. కానీ నా ప్రైవేట్ లైఫ్‌ను నేను వ్యక్తిగతంగా ఉంచాలనుకుంటున్నాను” అని స్పష్టంగా తెలిపారు. అయితే ఎవరైనా గాసిప్స్ రాసినా, అనుకున్నా పట్టించుకోనని చెప్పారు. ఇది విని ఫ్యాన్స్ ఆశ్చర్యపోవడమే కాక, రష్మిక మందన్నతో విజయ్ ఉన్న సంబంధంపై వస్తున్న వార్తలకు బలమైన సంకేతంగా భావిస్తున్నారు. ఈ జంటను ఇప్పటికే అనేక సందర్భాల్లో ఎయిర్‌పోర్ట్‌లు, వెకేషన్‌లలో కలిసి చూసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం విజయ్ నటించిన “కింగ్డమ్” అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది. జులై 31న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక “కింగ్డమ్” తర్వాత విజయ్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పిరియాడికల్ యాక్షన్ మూవీలో నటించబోతున్నారు. ఈ సినిమాలో రష్మిక కూడా హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరి రిలేషన్‌షిప్‌పై చర్చ మళ్లీ వేడెక్కింది. విజయ్ దేవరకొండ ప్రైవసీ గురించి స్పష్టత ఇచ్చినప్పటికీ, అభిమానుల్లో మాత్రం ఆసక్తి తీరట్లేదు.