Site icon HashtagU Telugu

Vijay Devarakonda: క్రేజీ అప్డేట్.. విజయ్ దేవరకొండ VD12 మూవీ ఫిక్స్

Whatsapp Image 2023 01 14 At 1.24.56 Pm

Whatsapp Image 2023 01 14 At 1.24.56 Pm

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాను నెక్ట్స్ చేయబోయే సినిమా గురించి సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరోకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. VD12 కి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ కాంబో సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. ఇటీవలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు గౌతం. జెర్సీ హిందీ తర్వాత రామ్ చరణ్ తో గౌతం సినిమా ఎనౌన్స్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే విజయ్ ను అప్రోచ్ అయ్యాడు గౌతం. మార్చి లేదా ఏప్రిల్ నుండి షూటింగ్ ఈ కాంబో సినిమా షూట్ మొదలు కానుంది. ఈ లోపు విజయ్ ‘ఖుషి’ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. సమంత డేట్స్ కారణంగా వాయిదా పడిన ఖుషి ఘాట్ త్వరలోనే మొదలు కానుంది.

Also Read: TSPSC Group 1 Result: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు వెల్లడి.. మెయిన్స్ కు 25,050 మంది అర్హత

అయితే రామ్ చరణ్ కి చెప్పిన కథతోనే విజయ్ సినిమా ఉంటుందా? లేదా గౌతం రౌడీ కోసం ఇంకో కథ రెడీ చేశాడా ? తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటైల్స్ త్వరలో రాబోతున్నాయి. లైగర్ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ ఖుషి , గౌతం తిన్ననూరి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ డెలివరీ చేయాలని భావిస్తున్నాడు.

Exit mobile version