Site icon HashtagU Telugu

Vijay and Rashmika Video: ముంబై ఎయిర్ పోర్టులో విజయ్, రష్మిక.. మల్దీవ్ కు ప్రేమపక్షులు!

Vijay And Rashmika

Vijay And Rashmika

ముంబయి విమానాశ్రయంలో ప్రేమపక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరూ కలిసి విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్తున్నారు. విజయ్ , రష్మిక ట్రావెల్ లుక్‌లో కంఫర్ట్ లుక్‌లో కనిపించారు. పుష్ప ఫేం రష్మిక కంఫర్ట్ ప్యాంటు, టీని ధరిస్తే, విజయ్ కూడా సాధారణ ప్యాంట్, టీ-షర్ట్ వేసుకొని కనిపించాడు. షూటింగ్స్ నుంచి ఏమాత్రం సమయం దొరికినా విజయ్, రష్మిక తరచుగా కలుస్తుంటారు. పార్టీలు, డేట్స్, పబ్స్ కు వెళ్తుంటారు.

న్యూ ఇయర్ వేడుకలను ఈ కపుల్ గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఎప్పుడూ చర్చనీయాంశమైంది. బహిరంగాగానే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండటంతో లవ్ బర్డ్స్ అనే ముద్ర వేశారు అభిమానులు. కానీ ఈ జంట మాత్రమే మేం స్నేహితులం మాత్రమే అని కొట్టిపారేశారు. కానీ విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. రష్మిక నా డార్లింగ్. తనతో రెండు సినిమాలు చేశాను. ఆమెతో కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పాడు.