Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ ఈ శుక్రవారం ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్దమవుతుంది. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా వాసుకి, అభినయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుండడంతో.. రెండు భాషల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే విజయ్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్.. రష్మిక తన లక్ అన్నట్లు మాట్లాడారు. విజయ్ అండ్ రష్మిక ప్రేమ వార్తలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ అనే విషయం అందరికి తెలిసిందే. అలాంటిది రష్మిక పుట్టినరోజు నాడే విజయ్ తన ఫ్యామిలీ స్టార్ ని రిలీజ్ చేస్తుండడంతో.. సోషల్ మీడియాలో వీరి ప్రేమ వార్తలు మరింత చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ చూసి చూసి రష్మిక డేట్ ని భలే ఎంచుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయం గురించే విజయ్ ని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దానికి విజయ్ బదులిస్తూ.. “రష్మిక బర్త్ డే నాడు సినిమా రిలీజవ్వడం లక్కీగా భావిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ మూవీలో రష్మిక మందన్న కూడా కనిపించబోతున్నారు. ఒక సాంగ్ లో రష్మిక గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేయనున్నారు.
APRIL 05 is #Rashmika‘s birthday.
I hope it will bring luck to #FamilyStar.
– #VijayDevarakonda pic.twitter.com/MkQ0zEqKmL
— Gulte (@GulteOfficial) March 31, 2024
రష్మిక మాత్రమే కాదు మజిలీ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’, అమెరికన్ భామ ‘మరిస్సా రోజ్ గార్డన్’ కూడా విజయ్ సరసన కనిపించబోతున్నారట. మరి ‘గీతగోవిందం’ తరువాత విజయ్ అండ్ పరుశురాం నుంచి వస్తున్న సినిమా కావడంతో విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకొని విజయ్ కి ఒక సరైన హిట్టు ఇస్తుందా లేదా చూడాలి.
Also read : Mahesh Babu : అమెరికాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్.. వీడియో వైరల్..