Site icon HashtagU Telugu

Rashmika : విజయ్ దేవరకొండ పోస్టర్ పై రష్మిక ఫైర్..!

Rashmika Marriage with Tolltywood hero

Rashmika Marriage with Tolltywood hero

Rashmika విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక పోస్టర్ రిలీజైంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నుంచి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీగా విడి 12వ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్. ఈ సినిమా నుంచి పొస్టర్ వదలగానే రష్మిక మందన్న నుంచి ఒక క్రేజీ కామెంట్ వచ్చింది.

విడి 12వ సినిమా పోస్టర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా రష్మిక మ్యాడ్ నెస్ అంటూ ఫైర్ సింబల్ ని కామెంట్ పెట్టింది. విజయ్ గురించి రష్మిక.. ఆమె గురించి విజయ్ ఇలా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అందరు అనుకోవడమే కానీ బయటకు మాత్రం ఏది తెలియట్లేదు. ఐతే ఆడియన్స్ సైలెంట్ గా ఉన్నా ఇదిగో ఇలా అతని సినిమా పోస్టర్ రాగానే రష్మిక ఇలా కామెంట్ పెట్టి మళ్లీ చర్చలకు ఛాన్స్ ఇస్తుంది.

Also Read : Krithi Shetty : అక్కడ ఫోకస్ చేస్తే బెటర్ అని ఫిక్స్ అయ్యిందా..?

ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న టాక్ ఉన్నా.. అది జస్ట్ ఫ్రెండ్ షిప్ అని అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా విజయ్ వెంటే రష్మిక అన్నట్టుగా అతన్ని ప్రతిక్షణం ఫాలో అవుతూ ఆడియన్స్ కు మరింత డౌట్ రేజ్ చేస్తుంది రష్మిక. విడి 12వ సినిమా 2025 మార్చి రిలీజ్ అని అనౌన్స్ మెంట్ కూడా వేశారు.

మంచి ఎగ్జాం టైం లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ ఎవరిదో కానీ విజయ్ ఈసారి మాత్రం బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించేందుకు గట్టి ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ రవికిరణ్, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్స్ లో సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.