విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సమంత(Samantha)తో కలిసి ఖుషి(Kushi) సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అనంతరం VD13 సినిమాగా పరుశురాం దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
గతంలో విజయ్ – పరుశురాం కాంబినేషన్లో వచ్చిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో VD13 సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సగం షూటింగ్ పైగా పూర్తయినట్టు కూడా చిత్రయూనిట్ తెలిపారు.
VD13 సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించడం ఆశ్చర్యం. తాజాగా VD13 సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్(Family Star) అనే టైటిల్ ని ప్రకటించారు. ఇక గ్లింప్స్ లో విజయ్ ఫ్యామిలీ మ్యాన్ అని చూపిస్తూనే మాస్ ఫైట్స్ కూడా ఉండబోతున్నట్టు చూపించారు. చివర్లో మృణాల్.. విజయ్ ని ఏమండీ.. అని పిలవడంతో టీజర్ కి హైప్ వచ్చింది.
ఇక ఇది ఫ్యామిలీ సినిమా అని తెలుస్తుంది. సంక్రాంతికి రిలీజ్ చేతమని మరోసారి క్లారిటీ ఇచ్చారు. గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 పూర్తవ్వకుండానే ముందే VD13 రిలీజ్ చేస్తారా చూడాలి మరి.
Also Read : Japan Teaser : కార్తీ జపాన్ టీజర్ చూశారా? దీపావళికి సరికొత్త బ్లాస్ట్..