Site icon HashtagU Telugu

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వాట్ నెక్ట్స్!

vijay deverkonda

vijay deverkonda

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. మైక్ టైసన్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలను శివ నిర్వాణ, సుకుమార్‌లతో చేయనున్నాడు. ముందుగా శివ నిర్వాణ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ప్రేమకథ అని అంటున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్‌-చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఆ తర్వాత విజయ్‌ చిత్రంలో నటిస్తోంది. శివ నిర్వాణ ​​సినిమా త‌ర్వాత సుకుమార్ సినిమాని విజ‌య్ దేవ‌ర‌కొండ టేక‌ప్ చేస్తార‌ని స‌మాచారం. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.