స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవలే కొన్ని రోజుల క్రితం మయోసైటిస్ నుంచి కోలుకొని వచ్చింది. ప్రస్తుతం సమంత చాలా బిజీగా ఉంది. ఓ పక్క సిటాడెల్(Citadel) సిరీస్, ఖుషి(Kushi) సినిమా షూటింగ్స్ తో, మరో వైపు శాకుంతలం(Shakunthalam) సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. గుణశేఖర్(Guna Sekhar) దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ గా తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.
దీంతో గత కొన్ని రోజులుగా సమంత, శాకుంతలం చిత్రయూనిట్ ఇండియా అంతా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక సమంత యశోద సినిమా తర్వాత మరో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా, మొదటి పాన్ ఇండియా సినిమా శాకుంతలం కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెకు అల్ ది బెస్ట్ చెప్తున్నారు.
తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సమంత కోసం ఓ స్పెషల్ లెటర్ ని రాసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ లెటర్ లో విజయ్ దేవరకొండ.. ”సామీ.. నువ్వు ఎప్పుడూ ప్రేమతో ఉంటావు, ఎప్పుడూ కరెక్ట్ పని చేస్తావు, చాలా ఉత్సాహంగా ఉంటావు. నువ్వు సినిమాలోని ప్రతి షాట్ కి ఇప్పటికి కూడా ది బెస్ట్ ఇస్తావు, అది నీ మొత్తం కెరీర్ మీద ఆధారపడి ఉంటుంది. గత సంవత్సరకాలంగా నువ్వు జీవితంతో ఎంత ఫైట్ చేస్తున్నావో ప్రపంచానికి తెలియకపోవచ్చు, అయినా ఎప్పుడూ నవ్వుతూ, నీ ఫ్యాన్స్ కోసం, సినిమాల కోసం ఒక అడుగు ముందుకేసి నడుస్తూ ఉంటావు. నీ శరీరానికి రెస్ట్ అవసరం అయినా సరే ముందుకు వెళ్తావు. రేపు రిలీజ్ కాబోతున్న నీ శాకుంతలం సినిమాకు ఆల్ ది బెస్ట్. నీ పట్టుదల, నీ అభిమానుల ప్రేమ నిన్నెప్పుడూ జాగ్రత్తగా ఉంచుతుంది. ప్రేమతో విజయ్” అని రాశాడు.
విజయ్ రాసిన లెటర్ కి సమంత రిప్లై ఇస్తూ.. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఇదే. థ్యాంక్యూ మై హీరో అని పోస్ట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ రాసిన ఈ లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. విజయ్, సమంత గతంలో మహానటి సినిమాలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఖుషి సినిమాలో మరోసారి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు విజయ్ ఇలా లెటర్ రాయడం, సమంత అలా రిప్లై ఇవ్వడంతో సమంత, విజయ్ మధ్య అనుకున్న దానికంటే ఎక్కువే స్నేహం ఉన్నట్టు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
At a loss for words..
Really needed this🤍
Thank you my hero!! @TheDeverakonda 🤍#Shaakuntalam https://t.co/jUHyNqtRWx— Samantha (@Samanthaprabhu2) April 13, 2023
Also Read : Radhika Apte: బాడీ షేమింగ్ పై రాధిక ఆప్టే షాకింగ్స్ కామెంట్స్