Vijay Devarakonda అంతకుముందు మోడల్ గా చేసిన త్రిప్తి డిమ్రి మ్యూజిక్ వీడియోస్ చేస్తూ బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించింది. వెబ్ సీరీస్ తో అలరిస్తున్న అమ్మడు సందీప్ వంగ దృష్టిలో పడింది. అలా యానిమల్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాతో త్రిప్తి సూపర్ పాపులర్ అయ్యింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక కన్నా త్రిప్తికి మంచి క్రేజ్ వచ్చింది.
అలా బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమాలో త్రిప్తిని తీసుకున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేసేందుకు త్రిప్తి ని దించుతున్నారట.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. త్రిప్తి డిమ్రి కు ఈ లక్కీ ఛాన్స్ తో అమ్మడి కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తున్న త్రిప్తికి తప్పకుండా ఇక్కడ మరిన్ని ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు.