Site icon HashtagU Telugu

Samantha-Vijay: విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాలు, వీడియో వైరల్

Vijay Devarakonda special Letter to Samantha for Shakunthalam Release

Vijay Devarakonda special Letter to Samantha for Shakunthalam Release

సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర పతాక సన్నివేశాలు ద్రాక్షారామంలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఆన్ సెట్స్ నుండి విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాల వీడియోలు లీకైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సన్నివేశంలో మురళీ శర్మను కూడా మనం చూడొచ్చు.

ఇది చివరి షెడ్యూల్ అని సమాచారం. దీంతో చిత్రీకరణ కంప్లీట్ అవుతుందట. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సెప్టెంబర్ 1న మూవీ విడుదల. చాలా కాలం తర్వాత సమంత రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ, సమంత రెండోసారి జతకట్టారు. మహానటి మూవీలో వీరిద్దరూ ప్రేమికులుగా కనిపించారు. ఈసారి పూర్తి స్థాయిలో రొమాన్స్ కురిపించనున్నారు.

కాగా ఈ చిత్రం తర్వాత సమంత విరామం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఏడాది పాటు సమంత కొత్త చిత్రాలకు సైన్ చేయరట. ఆమె విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారట. అలాగే అనారోగ్యం సమస్యల నుండి బయటపడేందుకు చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. విజయ్, సమంత కలిసి నటించడం ఇది రెండో సారి. మహనటి మూవీ తర్వాత ఖుషి సినిమాలో నటిస్తున్నారు.

Also Read: Transgender Clinic: ట్రాన్స్ జెండర్ కు గుడ్ న్యూస్.. ఉస్మానియాలో ప్రత్యేక ఆస్పత్రి