టాలీవుడ్(Tollywood) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి(Kushi) కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ(Vijadevarakonda), సమంత(Samantha) జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తోంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి తెలుగుతో పాటు తమిళనాడు(Tamilanadu) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.
ఇప్పటికే ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్న ఖుషి తమిళనాట మరో రికార్డ్ క్రియేట్ చేసింది. 7 కోట్ల రూపాయల వసూళ్లతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ ప్రేక్షకులు హీరో విజయ్ పై ఎంతగా ప్రేమ చూపిస్తున్నారో ఈ బాక్సాఫీస్ నెంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ ప్రతిచోటా సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖుషికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. మరి 100 కోట్లకు దూసుకుపోతుందేమో చూడాలి.
Also Read : Shiva Movie : నాగార్జున శివ మూవీ ఏఎన్నార్‌కి నచ్చలేదట.. అసలు ఆ కథ ఎలా ఒకే చేశావు అంటూ..