రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఖుషి తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీ లీలని అనుకున్నారు. పూజా కార్యక్రమాల్లో శ్రీ లీల (Sri Leela) పాల్గొన్నది కానీ సినిమా నుంచి ఆమె ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
శ్రీ లీల ప్లేస్ లో సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారత. రక్షిత్ శెట్టి (Rakshith Shetty) హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బి సినిమాల్లో నటించిన రుక్మిణి వసంత్ తన న్యాచురల్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. సినిమా చూసిన టైం లోనే రుక్మిణి గురించి సోషల్ మీడియాలో ఒకటే హడావుడి చేశారు. ఇక ఆ క్రేజ్ చూసిన మన మేకర్స్ ఆమెకు వరుస ఛాన్స్ లు ఇస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukhmini Vasanth) క్రేజీ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కి నటించే ఛాన్స్ ఉందట. ఆ అవకాశాన్ని యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి అందుకుందని తెలుస్తుంది. రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ (Animal) సినిమాలో త్రిప్తి రోల్ చిన్నదే అయినా ఆమె క్రియేట్ చేసిన ఇంప్యాక్ట్ ఓ రేంజ్ లో ఉంది. అందుకే అమ్మడికి వరుస అవకాశాలు ఇస్తున్నారు. సౌత్ లో మొదటిసారిగా విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్.
Also Read : Sreeleela : శ్రీలీల కు ఇక గడ్డుకాలమేనా..?
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి (Gautham Tinnanuri) కాంబోలో స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ నటించడం సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకొచ్చేలా ఉంది. ఓ పక్క త్రిప్తి మరోపక్క రుక్మిని ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తో విజయ్ దేవరకొండ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ భారీ రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అనంతరం విజయ్ దేవరకొండ పూర్తిగా ఈ సినిమా కోసం పనిచేస్తాడని తెలుస్తుంది.