Site icon HashtagU Telugu

Vijay Devarakonda Rashmika : రష్మికతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ..?

Vijay Devarakonda Rashmika Mandanna again pairing for movie

Vijay Devarakonda Rashmika Mandanna again pairing for movie

Vijay Devarakonda Rashmika రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో కూడా మరో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. అంతకుముందు వచ్చిన ఖుషితో పర్వాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో నిరాశపరచాడు. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు భారీ సినిమాల అనౌన్స్ మెంట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. ఆల్రెడీ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు.

ఆ సినిమా తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ నేడు రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తనతో టాక్సీవాలా లాంటి హిట్ అందించిన రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

VD14వ సినిమాగా వస్తున్న ఈ సినిమా నుంచి కూడా ఒక భారీ అనౌన్స్ మెంట్ వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. విజయ్ రష్మిక ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమా చేశారు.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ కాంబో మీద అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. ముచ్చటగా మూడవసారి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్నారు. మరి ఈ కాంబో ఎలాంటి మూవీతో వస్తున్నారన్నది చూడాలి.

Also Read : Gangs of Godavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అయ్యో, మరో వాయిదా..!