Site icon HashtagU Telugu

Vijay Devarakonda : కల్కి కోసం దేవరకొండ.. ఎంత డిమాండ్ చేశాడు..?

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Devarakonda ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. రీసెంట్ గా రిలీజైన కల్కి సెకండ్ ట్రైలర్ విజువల్ ట్రీట్ గ్యారెంటీ అనే కాన్ ఫిడెన్స్ ఇచ్చింది. తప్పకుండా తెలుగు సినిమా పేరుని ప్రపంచాస్థాయిలో నిలబెట్టే క్రమంలో నాగ్ అశ్విన్ కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటాడని అనిపిస్తుంది.

ప్రభాస్ కల్కి సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చ లాంటి స్టార్స్ నటించారు. దీపికా పదుకొనె ఫిమేల్ లీడ్ కాగా సినిమాలో దిశా పటాని కూడా ఒక మంచి పాత్రలో నటించింది. ఐతే ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడని తెలుస్తుంది. సినిమాలో క్యామియో రోల్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తాడట. ఐతే సాధారణంగా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో చిన్న పాత్ర చేసినా కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకుంటారు.

కల్కి సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్నది ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఐతే ట్విస్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కల్కి కోసం పనిచేశాడట. దానికి కారణం తనకు ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ అది కూడా భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో తను ఇన్వాల్వ్ అవ్వడమే మంచి అనుభూతిగా ఫీల్ అవుతూ విజయ్ దేవరకొండ సినిమాలో నటించినందుకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. విజయ్ మాత్రమే కాదు ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తుందని అంటున్నారు.