రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)..కన్ను నాగార్జున (Nagarjuna) మూవీ పై పడింది. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్..తాజాగా లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Lucky Bhaskar Pre Release Event) లో సందడి చేసాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఒకవేళ ఏదైనా మూవీ రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారని యాంకర్ సుమ ప్రశ్నించగా.. దీనికి బదులుగా తాను 1989లో పుట్టానని, అదే సంవత్సరం ఆర్జీవీ శివ (RGV Shiva) మూవీ వచ్చిందన్నారు. ఈ మూవీ రీమేక్ చేయాలని ఉందన్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ..జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తున్నాడు. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండకు 12వ మూవీ కావటంతో వర్కింగ్ టైటిల్ ‘వీడీ12’గా ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్టులో శ్రీలీల ను తీసుకోగా.. ఆమె తప్పుకుంది. ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రంలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రను విజయ్ పోషిస్తున్నారని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నాయి.
లక్కీ భాస్కర్ విషయానికి వస్తే..
వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). ఈ చిత్రంలో ఆయన సరసన మీనాక్షి చౌదరి (Minakshi Choudhury) నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments)పై ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేసారు.
Read Also : Sharmila’s Counter to Vijayasai Reddy : విజయసాయిరెడ్డికి షర్మిల కౌంటర్..