Site icon HashtagU Telugu

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ పేరు మార్చుకుంటున్నాడా..?

Vijay Devarakonda Movie Updates by Producer Naga Vamsy

Vijay Devarakonda Movie Updates by Producer Naga Vamsy

Vijay Devarakonda రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ప్రారంభించిన అనతికాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. యూత్ ఆడియన్స్ అంతా కూడా తనకు ఫిదా అయ్యేలా చేసుకున్న విజయ్ దేవరకొండ తన సినిమాలతో వారికి మరింత దగ్గరయ్యాడు. ఐతే డియర్ కామ్రేడ్ నుంచి విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టిన సందర్భాలు లేవు. లాస్ట్ ఇయర్ ఖుషి అక్కడక్కడ మాత్రమే లాభాలు తెచ్చింది కానీ ఓవరాల్ గా ఆ సినిమా కూడా నిరాశపరచింది.

ఇక ఈ సమ్మర్ కి భారీ అంచనాలతో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ కూడా డిజప్పాయింట్ చేసింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన పేరు మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాడట. పేరు మార్చుకోమని విజయ్ మదర్ సలహా ఇచ్చారట. అంతేకాదు పేరు ఎలా మార్చుకోవాలన్నది కూడా ఆమె దగ్గర ఉండి చూస్తున్నారట. విజయ్ దేవరకొండ అనేది యూత్ ఆడియన్స్ లో ఒక బ్రాండ్ గా ఏర్పడింది. అలాంటి బ్రాండ్ పేరులో మార్పులు అంటే విజయ్ ఫ్యాన్స్ షాక్ అవ్వక తప్పదు.

విజయ్ దేవరకొండ నిజంగానే పేరు మార్చుకుంటున్నాడా.. రౌడీ స్టార్ కూడా ఇలాంటివి నమ్ముతాడా లాంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక విజయ్ సినిమాలకు వస్తే ప్రస్తుతం గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్న దేవరకొండ హీరో ఆ తర్వాత రవికిరణ్, రాహుల్ సంకృత్యన్ సినిమాలను లైన్ లో పెట్టాడు.