Vijay Devarakonda విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లిచూపులుని డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ ఆ సినిమాతోనే ప్రాంతీయ సినిమా విభాగంలో నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ మరో సూపర్ హిట్ అందించాడు. కెరీర్ లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ తన థర్డ్ డైరెక్టోరియల్ మూవీగా కీడా కోలా చేశాడు. ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గెస్ట్ గా వచ్చాడు. తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) చాలా కాన్ఫిడెంట్ గా సినిమా ఆడియన్స్ ని అలరిస్తుందని అన్నారు. విజయ్ దేవరకొండ కూడా తరుణ్ మీద తనకు పూర్తిగా నమ్మకం ఉందని సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు. ఈ క్రమంలో విజయ్ తరుణ్ భాస్కర్ తో సినిమా అనౌన్స్ చేశారు.
Also Read : Mrunal Thakur : నెల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్.. టాలీవుడ్ ని ఊపేస్తున్న అమ్మడు..!
త్వరలో ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నామని వెల్లడించారు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు (Pellichupulu) సినిమా ఇప్పటికీ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్ విజయ్ కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇద్దరు సూపర్ టాలెంటెడ్ పీపుల్ కలిసి చేసే ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ అంచనాలకు రీచ్ అయ్యేలా వారు ఫుల్ ఎఫర్ట్ పెడతారని చెప్పొచ్చు.
తెలుగులో ఉన్న ప్రతిభ గల దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. అందుకే విజయ్ లాంటి హీరోతో అది హిట్ కాంబో రిపీట్ అయితే మాత్రం ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ ఆ ఎదురు చూస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join