విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం తన 12వ సినిమా గౌతం తిన్ననూరితో చేస్తున్నాడని తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ఈసారి కసిగా సినిమా చేస్తున్నాడు విజయ్. గౌతం తో చేస్తున్న సినిమా అసలు టార్గెట్ మిస్ అవ్వకూడదని చూస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.
సెట్స్ మీద ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ (Naga Vamsy) అంచనాలు పెంచేస్తున్నాడు. VD12 మీరు ఊహించిన దాని కన్నా భారీగా ఉంటుందని.. అందరినీ అది షాక్ చేస్తుందని అన్నారు. విజయ్ దేవరకొండ మాస్ ఏంటో చూస్తారన్నట్టుగా కామెంట్ చేశారు నాగ వంశీ. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఇలా అంచనాలు పెంచుతుంటే రౌడీ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.
విజయ్ దేవరకొండ సినిమా సాలిడ్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమా ఆ కిక్ ఇస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ గౌతం కాంబో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా లో విజయ్ మాస్ స్టామినా చూపించబోతున్నాడు. సినిమాను అసలైతే మార్చి ఎండింగ్ కి రిలీజ్ ప్లాన్ చేసినా ఆ డేట్ కి పవర్ స్టార్ సినిమా వస్తుందని తెలిసి మేకర్స్ మళ్లీ డేట్ మార్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇదే కాకుండా శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో కూడా సినిమా లైన్ లో పెట్టాడు.