Site icon HashtagU Telugu

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా..?

Vijay Devarakonda Movie Pla

Vijay Devarakonda Movie Pla

ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేస్తున్న రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. పరశురాం తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. సితార బ్యానర్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. జెర్సీ తర్వాత గౌతం తిన్ననూరి చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా ఆమె డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో రష్మిక మందన్నని తీసుకున్నారట.

అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ న్యూస్ విజయ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతల ప్లాన్ చాలా పెద్దగా ఉందని తెలుస్తుంది. విజయ్ తో గౌతం ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉందట. అందుకే ఈ సినిమా కథ ప్రకారం ఒక పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా చేయాలని అనుకుంటున్నారట.

ఖుషి (Khushi) కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా విజయ్ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. ఫ్యామిలీ స్టార్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గౌతం తిన్ననూరి సినిమా కథ ఏంటి సినిమాలో విజయ్ పాత్ర ఏంటన్నది తెలియాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ రష్మిక (Rashmika Mandanna) కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా విషయంలో విజయ్ కూడా చాలా ఫోకస్ గా ఉంటున్నాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి రష్మిక ఈ క్రేజీ కాంబో సెన్సేషనల్ మూవీని ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Kiran Abbavaram Rules Ranjan : ఏడాదిలో నేనేంటో చూపిస్తా..!