Site icon HashtagU Telugu

Vijay Devarakonda: రష్మిక తో పెళ్లి..? రౌడీ రియాక్షన్ ఇదే!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. పుష్పతో రష్మిక మందన్న పాన్ ఇండియా స్టార్ అయ్యిందో తెలిసిందే. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఈ ఏడాది ద్విభాషా ‘లైగర్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్నులో కూడా రష్మిక వర్క్ చేయబోతోంది.

రష్మిక, విజయ ఇప్పటివరకు గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. తరచుగా ఈ జంట ముంబై బీచ్ ల్లో చక్కర్లు కొడుతుండటం.. పార్టీల్లో కలుస్తుండటంతో పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్టయింది. అయితే వెండితెర హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట.. నిజజీవితంలోనూ జోడీగా చూడాలన్నదీ అభిమానుల కల కూడా. విజయ్ తల్లితో రష్మిక ఫ్రెండ్లీగానూ ఉంటుంది. కాగా హీరో విజయ్ స్పందిస్తూ ‘ఇది నాన్సెన్స్ న్యూస్’ అని ట్విట్టర్లో సీరియస్ అయ్యాడు.

 

Exit mobile version