Vijay Devarakonda : VD12.. థ్రిల్ చేసేందుకు అలాంటి ప్రయోగమా..?

Vijay Devarakonda ఫ్యామిలీ స్టార్ తో నిరాశపరచిన విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో

Published By: HashtagU Telugu Desk
Vijay Devarakonda Gautham Tinnanuri Another KGF Loading

Vijay Devarakonda Gautham Tinnanuri Another KGF Loading

Vijay Devarakonda ఫ్యామిలీ స్టార్ తో నిరాశపరచిన విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో రాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కథ కథనాల మీద మరోసారి రివ్యూ చేసుకున్న విజయ్ దేవరకొండ త్వరలోనే సినిమాను సెట్స్ మెదకు తీసుకెళ్లనున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం అనిరుద్ రవిచంద్రన్ ని మ్యూజిక్ కంపోజర్ గా ఫిక్స్ చేయగా సినిమాలో ఒక్క సాంగ్ కూడా లేకుండా కేవలం కథతోనే ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయాలని చూస్తున్నారట. తెలుగు సినిమాల్లో పాటలు లేకపోతే కష్టమే కానీ అలా చేస్తే సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కోలీవుడ్ లో కార్తీ ఖైదీ సినిమా అలాంటి ప్రయోగమే చేశారు.

ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా కోసం అలాంటి ప్రయోగం చేస్తున్నారట. అయితే సినిమాలో పాటలు లేకపోయినా అనిరుద్ బిజిఎం అదిరిపోతుందని అంటున్నారు. జెర్సీ సినిమాతో తెలుగు, హిందీ భాషల్లో సక్సెస్ అందుకున్న గౌతం తిన్ననూరి విజయ్ దేవరకొండతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. అందులో ఒకరు యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కాగా మరొకరు ప్రేమలు బ్యూటీ మమితా బైజు అని అంటున్నారు.

Also Read : Viswak Sen : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం ఆ పని పూర్తి చేసిన విశ్వక్..!

  Last Updated: 25 Apr 2024, 07:32 PM IST