Site icon HashtagU Telugu

Vijay Devarakonda : శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ..!

Vijay Devarakonda Movie Updates by Producer Naga Vamsy

Vijay Devarakonda Movie Updates by Producer Naga Vamsy

Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈ సినిమా డిఫరెంట్ సినిమాగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీలీలని అనుకున్నా ఆమె ప్లేస్ లో రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న భాగ్య శ్రీ కి ఛాన్స్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ కొంత పార్ట్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంకలో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 6 నుంచి అక్కడ యాక్షన్ సీన్స్ చేస్తారని టాక్. దాదాపు 40 రోజుల దాకా అక్కడే షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాతో పాటుగా రవికిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా.. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ 3 సినిమాలతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడని అర్ధమవుతుంది. కచ్చితంగా విజయ్ దేవరకొండ స్టామినా ఈ సినిమాలతో ప్రూవ్ అయ్యేలా చేయాలని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.