విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సమంత(Samantha) కలిసి నటించిన ఖుషి(Kushi) సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా నేడు ఖుషి సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూశాక ప్రేమ తరవాత పెళ్లిలో ఉండే కష్ట సుఖాల గురించి ఈ సినిమా అని తెలుస్తుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానమిచ్చాడు.
ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండని పెళ్లి గురించి ప్రశ్నించగా విజయ్ సమాధానమిస్తూ.. మొదట్లో పెళ్లి అనే మాట వింటేనే కోపం వచ్చేది. కానీ ఇప్పుడు నేను కూడా దాని గురించి మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారి లైఫ్ ఎలా ఉంది అని అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాము. పెళ్లి జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వేరే వాళ్ళ సమస్యలని చూసి పెళ్లి అంటే భయపడకూడదు. పెళ్ళిలో ఉన్న అందమైన విషయాల గురించి ఆలోచించి చేసుకోవాలి. నేను కచ్చితంగా ఇంకో మూడేళ్ళలో పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే అందరికి చెప్తాను అని క్లారిటీ ఇచ్చాడు విజయ్.
Also Read : Kushi Trailer: ఖుషి ట్రైలర్ రిలీజ్, విజయ్, సమంత కెమిస్ట్రీ అదుర్స్!