Site icon HashtagU Telugu

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్.. VD12 ప్లాన్ చేంజ్..!

Vijay Devarakonda Gautham Tinnanuri Another KGF Loading

Vijay Devarakonda Gautham Tinnanuri Another KGF Loading

Vijay Devarakonda విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ లో గీతా గోవిందం సినిమా రాగా అది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చిన్న సినిమాగా మొదలై 100 కోట్ల క్లబ్ లో చేరి భారీ సినిమాగా అది క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ కాంబోలో మరో సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. కానీ ఫ్యామిలీ స్టార్ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మేకర్స్ ఎంత ప్రమోట్ చేసినా సినిమా ఆడియన్స్ కు ఎక్కలేదు.

ఏప్రిల్ 5న రిలీజైన ఫ్యామిలీ స్టార్ మొదటి వీకెండ్ లోనే చెతులు ఎత్తేసింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో డిజాస్టర్ సినిమాగా అది మిగిలింది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ మరోసారి కథల విషయంలో తన ఫోకస్ మరింత పెంచుకుంటున్నాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తేడా కొట్టడంతో గౌతం తిన్ననూరి సినిమా పై మరింత కేర్ తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్పై థ్రిల్లర్ గా వస్తున్న VD 12వ సినిమాలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ భామ భాగ్య శ్రీ బోర్స్ ని తీసుకుంటున్నారని టాక్. ఈ సినిమా కోసం విజయ్ తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Also Read : Prabhas Anushka : కన్నప్ప ప్లాన్ అదిరింది.. ప్రభాస్ తో పాటు అనుష్క కూడా..!