రౌడీ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్ ఇచ్చారు యువ నిర్మాత నాగ వంశీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి (Gautham Tinnanuri) సినిమా గురిచ్యి క్రేజీ కామెంట్స్ చేశారు. గౌతం విజయ్ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుగుతుందని.. ఇది గౌతం తిన్ననూరి మార్క్ KGF అని అన్నారు నాగ వంశీ. అంటే ఆ కథ అని కాదు ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పి రౌడీ ఫ్యాన్స్ ని ఖుషి చేశారు నాగ వంశీ.
ఇదే ఇంటర్వ్యూలో కలెక్షన్స్ పోస్టర్స్ కావాలనే వేస్తామని చెప్పి షాక్ ఇచ్చారు. అసలు కలెక్షన్స్ ఏంటన్నది మాకు మాత్రమే తెలుసని అన్నారు. దేవర విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ అంతా హ్యాపీ అని అన్నారు. మహేష్ గుంటూరు కారం సినిమా గురించి కూడా ప్రస్తావించిన నాగ వంశీ ఆ సినిమాను మాస్ మూవీగా ప్రమోట్ చేశామని టైటిల్ కూడా వేరేది పెడితే బాగుండేదని అన్నారు.
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సూపర్ హిట్లు..
ఐతే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గౌతం తిన్ననూరి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అన్నారు నాగ వంశీ. విజయ్ దేవరకొండకు తాను హిట్ ఇవ్వడం ఏంటి అతను ఆల్రెడీ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సూపర్ హిట్లు కొట్టాడని.. అయినా ఒక హీరోకి నిర్మాత హిట్ ఇస్తానని ఎలా చెబుతాడని అన్నారు నాగ వంశీ.
ప్రస్తుతం నాగ వంశీ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్నిటిలో కల్లా రౌడీ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా VD12వ సినిమా గురించి కె.జి.ఎఫ్ తో పోల్చడం ఫ్యాన్స్ కి హై ఇచ్చింది.
Also Read : Rana : మహేష్ తో రానా ఫైట్.. రాజమౌళి మెగా ప్లాన్..!