Site icon HashtagU Telugu

Rashmika Mandanna: భరించలేక పోతున్న రష్మిక

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రష్మిక మందన నటించిన బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ హాట్ టాపిక్ గా మారింది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందనను ట్రోల్ చేస్తున్నారు. రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ జంట స్పందించకపోవడంతో అందరూ ఇదే నిజమని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియదు కానీ విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో రష్మికను పరిమితికి మించి ట్రోల్ చేస్తున్నారు.

రష్మిక ఈ మధ్య సినీమాల్లో ఘాటుగా రొమాన్స్ చేస్తుంది. హీరోలకు లిప్ లాక్ కి అస్సలు నో చెప్పట్లేదు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. రణబీర్ కపూర్ లిప్ లాక్ సన్నివేశాలతో ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఫ్లైట్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన మధ్య వచ్చే సన్నివేశాలు విజయ్ అభిమానుల గుండెల్లో మంట పుట్టించేలా ఉన్నాయి. విజయ్ అభిమానులు ఆ స్థానంలో రణబీర్ కపూర్‌ని ఊహించలేరు. దీంతో రష్మిక మందనను సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు దుర్భాషలాడుతున్నారు. ఒక్క పాటలోనే ఇన్ని ముద్దులున్నాయి అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఆమె పోస్టులకు కామెంట్ బాక్స్ ని హైడ్ చేసింది.

Also Read: Copied Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిన కేసీఆర్