Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు ప్రేమతో..

అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఫేం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 12:58 PM IST

అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఫేం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఈ రౌడీకి ప్రత్యేకమైన అభిమానులున్నారు. అంతకాదు.. విజయ్ కు అమ్మాయిల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. వీరాభిమాని అయిన ఓ అమ్మాయి వీపుపై విజయ్ కు సంబంధించిన ఫొటోను టాటూను వేయించుకుంది. అభిమాన హీరోను కలవాలని ఎంతో ఆశ పడింది. ఆ సందర్భం రానే వచ్చింది. లైగర్ షూటింగ్ లో ఉన్న విజయ్ ను కలుసుకుంది. తన బ్యాక్ పై వేయించుకున్న టాటూను విజయ్ చూపించి ఎమోషన్ అయ్యింది. విజయ్ దేవరకొండ కూడా ఆ అమ్మాయి ప్రేమకు ఫిదా అయ్యాడు. ఆమెను దగ్గరకు తీసుకొని హగ్ ఇచ్చాడు. పక్కన ఉన్న చార్మి, పూరి సైతం షాక్ అయ్యారు.