విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఆమధ్య వచ్చిన ఐరనే వంచాలా ఏంటి టీజర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేయగా సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించి అలరించనున్నాడు.
ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్న దిల్ రాజు సంకాంతి సినిమాల హడావిడిలో ఎందుకని వాయిదా వేసుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ అనుకున్నా కుదరలేదు. ఫైనల్ గా సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. అఫీషియల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
The Family Star
ఏప్రిల్ 5 అసలైతే ఎన్.టి.ఆర్ దేవర రావాల్సింది. కానీ ఆ సినిమా వయిదా పడుతున్న కారణంగా దేవర ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చేస్తున్నాడు. మరి సాలిడ్ డేట్ పట్టేసిన దేవరకొండ సినిమాతో హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. సీతారామం, హాయ్ నాన్న రెండు హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న మృణాల్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తుంది. మరి ఈ సినిమా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
పరశురాం తో ఆల్రెడీ గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ మరోసారి అలాంటి క్రేజీ హిట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా విజయ్ ని తిరిగి ఫాంలోకి తెచ్చేలా చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.