Site icon HashtagU Telugu

Family Star OTT: ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

The Family Star Collections

The Family Star Collections

Family Star: ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ పేట్ల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ది ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5, 2024న విడుదలైన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. తాజా వార్త ఏమిటంటే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ది ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 26, 2024 (శుక్రవారం) నుండి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది.

థియేట్రికల్ రన్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాను ఓటీటీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవిబాబు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ, పరశురాం డైరెక్షన్ లో వచ్చిన గీత గోవిందం హిట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ పై ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా ఫెయిల్ అయ్యింది.