Vijay Devarakonda : ఒత్తిడిలో విజయ్ దేవరకొండ..?

గీత గోవిందం తర్వాత సరైన హిట్ ఒకటి కూడా విజయ్ ఖాతాలో పడలేదు

Published By: HashtagU Telugu Desk
Vijay

Vijay

యూత్ స్టార్ , రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒత్తిడికి లోనవుతున్నాడా..? అంటే అవుననే చెప్పాలి. గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ ఆయన్ను డౌన్ చేయడమే కాదు మార్కెట్ లో ఆయన రేంజ్ ను బాగా తగ్గిస్తున్నాయి. దీంతో ఓ సూపర్ హిట్ కొట్టాలనే తపనతో ఊగిపోతున్నాడు. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం వంటి వరుస హిట్ల తో ఒక్కసారిగా తన రేంజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ అయితే విజయ్ కి ఫిదా అయ్యారు. దీంతో నిర్మాతలు విజయ్ కి భారీ రెమ్యూనరేషన్ ఇస్తూ తన డేట్స్ తీసుకున్నారు. గీత గోవిందం తర్వాత సరైన హిట్ ఒకటి కూడా విజయ్ ఖాతాలో పడలేదు. వరుసపెట్టి విభిన్న కథలతో వస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఒక్క విజయం కూడా అందించలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ (The Family Star) కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్టర్ అవ్వడం , దిల్ రాజు నిర్మాత, గోల్డెన్ బ్యూటీ మృణాల్ హీరోయిన్ గా నటించడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావించారు కానీ కథలో కొత్తదనం లేకపోవడం , రొటీన్ సీన్లు , బోరింగ్ సన్నివేశాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద రెండో రోజు నుండే కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. మూడు రోజుల్లోనే సినిమా భారీ ప్లాప్ దిశగా వెళ్ళింది. ఇలా వరుస ప్లాప్స్ పడుతుండడం తో విజయ్ ఒత్తిడికి గురి అవుతున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి పెరుగుతుంది. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ గౌతమ్ మూవీ పైనే పెట్టుకున్నాడు.

2023లోనే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri)తో విజయ్ ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట కృతి శెట్టి ని అనుకున్నారు కానీ…ఇప్పుడు ప్రేమలు సినిమాలో నటించిన మమిత బైజు నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్, సాయి సౌజన్య ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిపి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ లో విజయ్ ఒక పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమా పైనే విజయ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా తో సూపర్ హిట్ కొత్త తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. మరి విజయ్ కల తీరుతుందా..? గౌతమ్ సూపర్ హిట్ ఇస్తాడా..? అనేది చూడాలి.

Read Also : World Parkinson’s Day 2024: పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి..? మెద‌డును ప్ర‌భావితం చేసే ఈ వ్యాధి ల‌క్ష‌ణాలివే..!

  Last Updated: 11 Apr 2024, 09:05 AM IST