Site icon HashtagU Telugu

Rashmika : ఫోర్బ్స్ జాబితాలో రష్మిక..విజయ్ ఆనందం అంత ఇంతకాదు..

Rashmika Vijay Forbs

Rashmika Vijay Forbs

రష్మిక ఫోర్బ్స్ జాబితాలో (Forbes )చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన 30ఏళ్లలోపు వ్యక్తులతో ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ (Forbes India 30 Under 30 Class of 2024) జాబితాను రూపొందించింది. ఇందులో రష్మిక టాప్ ప్లేస్లో నిలిచి ఆశ్చర్య పరిచింది. ఈ విషయాన్ని స్వయంగా అభిమానులతో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. దీంతో సినీ ప్రముఖులతో పాటి అభిమానులు ఆమెకు విషెష్ అందజేస్తున్నారు.

వీరిలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’ అని ఆయన ఇన్ఫ్రా పోస్ట్ పెట్టారు. దీనికి ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ ఫొటోను జత చేశారు. విజయ్ పోస్ట్ చూసి ఫ్యాన్స్ మరింత గా రష్మిక కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక విజయ్- రష్మిక లు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. గీత గోవిందం మూవీ వీరిద్దరి కాంబో లో వచ్చిన ఫస్ట్ మూవీ. ఈ మూవీ ప్రేక్షకులను , ముఖ్యంగా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో వీరిద్దర్నీ చూసి చాలామంది కుల్లుకున్నారు. ఆ రేంజ్ వీరిద్దరూ అదరగొట్టారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ చాల దగ్గరయ్యారు. ప్రేమలో కూడా పడ్డారని ప్రచారం నడుస్తుంది. కాకపోతే వీరు మాత్రం మీము మంచి ఫ్రెండ్స్ అని చెపుతుంటారు. వారి అసలు నిజం ఏంటి అనేది వారికే తెలియాలి.

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే…పుష్ప2 : ది రూల్ లో నటిస్తుంది. ఈ మూవీ ఆగస్టు 15 న విడుదల కానుంది. VD12 – విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుంది. D51 – ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమాలో , రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా లో, రెయిన్‌బో – లేడీ ఓరియెంటెడ్ మూవీలో , ఇక లేటెస్ట్‌గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉంది.

Read Also : Farmers Protest:రైతు సంఘాలతో కేంద్రం చర్చలు అసంపూర్ణం.. 18న మరోసారి భేటీ