ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్(Viraj Ashwin) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా బేబీ(Baby). SKN నిర్మాణంలో సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జులై 14న రిలీజయిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే బేబీ సినిమా దాదాపు 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఒక చిన్న సినిమా, స్టార్స్ లేకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ మూడు రోజుల్లోనే రావడం అంటే చాలా గ్రేట్.
బేబీ సినిమా ఇంత భారీ విజయం సాధించడంతో చిత్రయూనిట్ నిన్న సోమవారం (జులై 17) సాయంత్రం హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్ లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అల్లు అరవింద్(Allu Aravind), నాగబాబు(Nagababu) ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడిన అనంతరం తన తమ్ముడి గురించి కూడా మాట్లాడాడు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మా తమ్ముడ్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మా తమ్ముడు సినిమాల్లోకి వస్తాను అంటే ముందు తిట్టాను. ఆ తర్వాత వస్తే రా, నేనైతే ఏం హెల్ప్ చేయను, నా దగ్గరికి రావద్దు అని చెప్పాను. ఇండస్ట్రీలో కష్టాలు నాకు తెలుసు. అవన్నీ వద్దని చెప్పాను. కానీ వాడు వినలేదు. వాడి మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా అన్ని సినిమాలు వాడే చూసుకున్నాడు. బేబీ సినిమా గురించి కూడా నాకేం చెప్పలేదు. డైరెక్ట్ సినిమా ప్రీమియర్ రోజు పిలిస్తే వెళ్లి చూశాను. ఈ సినిమా చూసి నాకు కూడా ఏడుపొచ్చింది. వాడ్ని చూస్తుంటే ఇప్పుడు గర్వంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Taapsee : తాప్సీకి ఎన్ని బిజినెస్‌లు ఉన్నాయో తెలుసా? బాగా సంపాదిస్తుందిగా..