Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందిస్తూ.. ఇది తాత్కాలిక దశ మాత్రమేనని, తప్పకుండా బాలీవుడ్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో త్వరలోనే నూతన దర్శకులు ఉద్భవిస్తారని, వారు పరిశ్రమకు కొత్త ఊపిరి తెస్తారని అన్నారు. అయితే, ఈ దర్శకులు ముంబైకి చెందిన వారు కాకుండా, బయటి ప్రాంతాల నుండి వచ్చే వారే హిందీ సినిమాను తిరిగి నిలబెడతారని విజయ్ అభిప్రాయపడ్డారు.
విజయ్ మాట్లాడుతూ.. “దక్షిణ భారత చిత్ర పరిశ్రమ గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, పోరాడి గుర్తింపు సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ కూడా అదే దశలో ఉంది. ఈ శూన్యత నుండి కొత్త తరం దర్శకులు ఆవిర్భవిస్తారు. వారు ముంబై బయటి నుండి, హిందీ మాట్లాడే ఇతర ప్రాంతాల నుండి వస్తారని నా అంచనా. వారు సినిమాలను భిన్నమైన శైలిలో దక్షిణాది సినిమాలకు భిన్నంగా రూపొందిస్తారని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ ఈ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ బాహుబలి వంటి చిత్రాల ద్వారా తెలుగు సినిమా ప్రపంచ వేదికపై నిలిచిన విధానాన్ని ఉదాహరణగా చూపారు. ఈ కొత్త దర్శకులు బాలీవుడ్‌కు కొత్త దిశానిర్దేశం చేస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read: Charminar Damaged: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
విజయ్ దేవరకొండ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి, యువతలో విపరీతమైన ఆదరణ సంపాదించాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకు సినిమాల ఎంపికలో ప్రత్యేన శైలి ఉంది.
విజయ్ దేవరకొండ రాబోయే సినిమాలు
- కింగ్ డమ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది.
- VD14 (వర్కింగ్ టైటిల్)
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ 2025 జనవరిలో ప్రారంభం కానుంది.